పశువుల పాక దగ్ధం
వర్ని: చందూరు మండలం ఘన్‌పూర్ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున పశువుల పాక దగ్ధమైంది. గాలి పల్లెబోయికి చెందిన పశువుల పాకకు నిప్పుంటుకోగా గమనించిన యజమాని గేదెలను ప్రమాదం నుంచి తప్పించారు. ప్రమాదంలో రూ. 50 వేల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు వెల్లడించారు.
షార్ట్ సర్క్యూట్‌తో మీ సేవ కేంద్రం..
బాన్సువాడ: బీర్కూర్ మండలం రైతునగర్‌లో ఆదివారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో మీ సేవ కేంద్రం దగ్ధమైంది. కేంద్రంలో రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కంప్యూటర్, ప్రింటర్ తదితర వస్తువులు కాలి బుడిదయ్యాయి. గమనించిన స్థానికులు ఫైరింజన్‌కు ఫోన్ చేయడంతో సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు.
Comments
Please login to add a commentAdd a comment