బడిబయటి పిల్లల గుర్తింపు
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్‌నగర్ మండలంలోని సింగితంలో సోమవారం ఇద్దరు బడిబయటి పిల్లలను గుర్తించినట్లు సీఆర్పీలు శంకర్‌గౌడ్, వెంకట్రాంగౌడ్ తెలిపారు. గ్రామానికి చెందిన మద్దెల శివకుమార్, మల్కల ప్రవీణ్ బడి మానేసి బడి బయట ఉన్నారన్నారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడి బడిలో చేర్పించడం జరిగిందని సీఆర్పీలు తెలిపారు.
ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డిరూరల్: సోమార్‌పేట్ పాఠశాలలో ఇద్దరు బడి బయటి పిల్లలను చేర్పించినట్లు సీఆర్పీ మహిపాల్ సోమవారం తెలిపారు.నిజాంసాగర్ మండలంలోని పిప్పిర్యాగడి తండా శివారులోని బడి బయట ఉన్న ఇద్దరు పిల్లలను గుర్తించి వారికి సమీపంలోని సోమార్‌పేట్ ప్రాథమిక పాఠశాలలో చేర్పించినట్లు ఆయన తెలిపారు. హెచ్‌ఎం శివకుమార్, అజ్మత్ తదితరులున్నారు.
తాడ్వాయిలో..
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో సోమవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో రామస్వామి ఆధ్వర్యంలో సీఆర్పీలు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ 10 మంది బడిబయట పిల్లలను గుర్తించారు. ఎంఈవో రామస్వామి, సీఆర్పీ లు నర్సింలు, రాజేందర్, రాధ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment