ఖలీల్‌వాడి: జిల్లాకు త్వరలో పోలీస్ కమిషనర్ రానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కొత్త సీపీ వస్తారని పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్టోబర్ 23న సీపీ కల్మేశ్వర్ కేంద్ర సర్వీసులకు బదిలీపై వెళ్లడంతో సీపీ పోస్టు ఖాళీ అయ్యింది. ఈ స్థానంలో కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. కాగా జిల్లాకు సీపీగా రావడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం విదేశాలకు వెళ్లడంతో సీపీ నియామకం ఈనెల ఆఖరు వరకు అయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. కాగా జిల్లాకు డైరెక్ట్ ఐపీఎస్‌ను తీసుకు రావడానికి సీనియర్ కాంగ్రెస్ నేత, ప్రజాప్రతినిధి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు డైరెక్ట్ ఐపీఎస్‌తోపాటు సమర్థుడి కోసం వెతుకుతున్నట్లు సమాచారం.
మంత్రి సమీక్షలో చర్చ
నిజామాబాద్ కలెక్టరేట్‌లో ఆదివారం ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులతో ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోస్టుపై చర్చ జరిగింది. ఎమ్మెల్సీ కవిత మా ట్లాడుతూ సీపీ లేకపోవడంతో జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. దీంతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి జోక్యం చేసుకొని సమర్థుడిని కోసం వెతుకుతున్నామని అందుకోసమే సీపీ పోస్టు ఖాళీగా ఉందన్నారు. త్వరలోనే సీపీ వస్తారని చెప్పారు.
సెలవులో వెళ్లనున్న ఇన్‌చార్జి సీపీ
ఇన్‌చార్జి సీపీ సింధుశర్మ దీర్ఘకాలిక సెలవులో వెళ్లనున్నారు. అమెరికాలో ఎల్‌ఎల్‌ఎంకు అవకాశం రావడంతో వెళ్లనున్నట్లు తెలిసింది. అమెరికాకు వెళ్లే క్రమంలో హైదరాబాద్‌కు బదిలీ చేయించుకోవడానికి యత్నిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాతే సెలవులో వెళ్తారని తెలిసింది.
నెలాఖరులోగా
నియమించే అవకాశం
Comments
Please login to add a commentAdd a comment