నిజామాబాద్ సిటీ: బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పలేక రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి విమర్శించారు. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీని ఎమ్మెల్యే బహిష్కరించడంపై మానాల ప్రకనట విడుదల చేశారు. కల్యాణలక్ష్మి చెక్కులతోపాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని, ఏడాది నుంచి ప్రశాంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ప్రశాంత్ రెడ్డి తీరును కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. గతంలో ప్రశాంత్ రెడ్డి నిర్లక్ష్యంతోనే చెక్కులు ఆగిపోయాయన్నారు. ఆయన చేసిన తప్పుకు లబ్ధిదారులకు క్షమాపణ చెప్పాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment