![క్రీడా జ్యోతి వెలిగిస్తున్న పాఠశాల డైరెక్టర్ రేణుక - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/19/18knt257-180090_mr_0.jpg.webp?itok=bhWurJO8)
క్రీడా జ్యోతి వెలిగిస్తున్న పాఠశాల డైరెక్టర్ రేణుక
కరీంనగర్: నగరంలోని వాణినికేతన్ బాలవిహార్ పాఠశాలలో గురువారం వార్షిక ఆటల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పాఠశాల డైరెక్టర్ రేణుక ఒలింపిక్ జ్యోతి వెలిగించి శాంతి పావురాన్ని ఎగురవేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ పాఠశాలలో చదువుతో పాటు విద్యార్థులకు అన్ని రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి భాషా, సాంస్కృతిక, ఆటలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ది సాధించాలంటే భౌతికంగా శారీరక శ్రమ ఎంతో ఉపయోగపడుతుందని, దాని కోసం ఆటల పోటీలు, విద్యార్థుల్లో పోటీతత్వం పెంచుతామని అన్నారు. ఆనంతరం విద్యార్థులు చేసిన యోగాసనాలు, డంబుల్స్‌డాన్స్, కబడ్డీ డాన్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రిటైర్డు ప్రధానోపాధ్యాయుడు హన్మంతరావు, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్, కిడ్స్‌కేర్ ఇన్‌చార్జి జేసన్, అంజయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment