మేకలు ఎత్తుకెళ్లిన దొంగలు జైలుకు..
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కాల్వశ్రీరాంపూర్, మల్యాల గ్రామాల్లో మేకలను ఎత్తుకెళ్లిన దొంగలను కాల్వశ్రీరాంపూర్ పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు. ఎస్సై వెంకటేశ్ వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన పసుపతి శేఖర్, కమాన్‌పూర్ మండలం పెంచికలపేట్‌కు చెందిన శిరాత్రి రమేశ్, చొప్పదండికి చెందిన పసుపతి సంజీవ్‌కుమార్, మరికొందరు పరిచయస్తులు మద్యం పార్టీలో కలుసుకున్నారు. ఈనెల 2న రెండు కార్లలో కాల్వశ్రీరాంపూర్‌కు బయలుదేరారు. ఈనెల 3న కాల్వశ్రీరాంపూర్‌లో అర్ధరాత్రి తిప్పనవేన కొమురయ్య ఇంటికి వెళ్లారు. సమీపంలో ఉన్న మేకల కొట్టంలో మూడు మేకలను ఎత్తుకెళ్లారు. అదేరోజు మల్యాల గ్రామంలో బొల్లి రాజయ్య ఇంట్లో రెండు మేకలను ఎత్తుకెళ్లారు. మేకలను చొప్పదండికి తీసుకుపోయి పసుపతి సంజీవ్‌కుమార్ కొట్టంలో దాచిపెట్టారు. తిరిగి ఈనెల 9న దొంగతనం చేయాలని కారులో కమాన్‌పూర్ మండలం పెంచికలపేట్ గ్రామానికి చెందిన శివరాత్రి రమేశ్, చొప్పదండికి చెందిన పసుపతి సంజీవ్‌కుమార్ కాల్వశ్రీరాంపూర్ వస్తుండగా.. గంగారం క్రాసింగ్ వద్ద పట్టుకొని విచారించారు. చొప్పదండిలో దాచిన ఐదు మేకలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. మరికొందరు పరారీలో ఉన్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment