రాజన్న క్షేత్రం.. భక్తజన సంద్రం
వేములవాడ: ఎములాడ రాజన్న క్షేత్రం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. శ్రీరాజరాజేశ్వరస్వామిని దాదాపు 60 వేల మంది దర్శించుకున్నారు. ధర్మగుండంలో పుణ్యస్నానాలు చేసి, కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. కోడె, నిలువెత్తు బెల్లం మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని గమనించిన ఆలయ ఈవో వినోద్‌రెడ్డి ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి భద్రతను పర్యవేక్షించారు. వీఐపీల దర్శనాలకు ఇబ్బందులు కలగకుండా బ్రేక్ దర్శనాలను కొనసాగించారు. భక్తుల ద్వారా రూ.70 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మహాశివరాత్రి జాతర ముందే వచ్చిందా.. అన్నంత సందడి కనిపించింది.
రాజన్న క్షేత్రం.. భక్తజన సంద్రం
రాజన్న క్షేత్రం.. భక్తజన సంద్రం
Comments
Please login to add a commentAdd a comment