యైటింక్లయిన్‌కాలనీ: రామగిరి మండలం చందనాపూర్ గ్రామానికి చెందిన రంగు నాగరాజుతోపాటు మరికొందరి రైతులకు సంబంధించిన వ్యవసాయ భూమి వద్ద ఉన్న విద్యుత్ మోటార్ తీగలు చోరీకి గురయ్యాయి. గోదావరిఖని టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. నాగరాజుకు గ్రామ శివారులో నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. సుందిళ్ల గ్రామ శివారులోని గోదావరి నది నుంచి మోటార్ల ద్వారా నీరందుతోంది. ఈనెల 8న పొలానికి నీరు పెట్టి వచ్చారు. మరుసటి రోజు పొలం వద్దకెళ్లి చూడగా.. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి మోటారు వరకున్న దాదాపు 200 మీటర్ల సింగిల్ పీస్ విద్యుత్ వైరును గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారు. దాని విలువ రూ.2వేల వరకుంటుంది. అదే రోజు గ్రామంలోని మరికొందరు రైతులు మహేందర్, కస్తూరి శంకర్, నడిపెల్లి సాగర్, దానేటి తిరుపతిలకు సంబంధించిన వ్యవసాయ విద్యుత్ మోటార్ల వైర్లు 200 మీటర్లు చోరీకి గురయ్యాయి. సోమవారం బాధితులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment