![మహా క](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10vmd53-180057_mr-1739214696-0.jpg.webp?itok=U4-7NSTD)
మహా కుంభమేళాకు వెళ్లి మృతి
కోనరావుపేట(వేములవాడ): మహా కుంభమేళాకు వెళ్లిన ఓ భక్తుడు హఠాన్మరణం చెందాడు. కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కదిరె శ్రీనివాస్‌గౌడ్(46) తన స్నేహితులు మానుక వీరమల్లు, పారిపెల్లి మాధవరెడ్డి, సంజీవరెడ్డి, ఉప్పుల వెంకటేశంతో కలిసి ఈనెల 6న రైలులో కుంభమేళాకు వెళ్లాడు. కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించి అయోధ్య దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత కాశికి వెళ్లి దర్శనానికి వరుసలో ఉన్నారు. ఆదివారం ఉదయం వరుసలో ఉండగానే ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. వెంటనే అంబులెన్స్‌లో అక్కడి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌గౌడ్ సోమవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు స్నేహితులు ఫోన్ ద్వారా సమాచారమందించారు. మృతుడికి భార్య మనీషా, కూతురు అనన్య, కుమారుడు వరప్రసాద్ ఉన్నారు. శ్రీనివాస్ మృతదేహాన్ని అంబులెన్స్‌లో గ్రామానికి తరలిస్తున్నారు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
వెంకట్రావుపేటలో విషాదం
![మహా కుంభమేళాకు వెళ్లి మృతి 1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10vmd52-180057_mr-1739214696-1.jpg)
మహా కుంభమేళాకు వెళ్లి మృతి
Comments
Please login to add a commentAdd a comment