![ఐదుగురిపై కేసు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10knt253-180090_mr-1739214693-0.jpg.webp?itok=C9X5gsfi)
ఐదుగురిపై కేసు
జమ్మికుంట(హుజూరాబాద్): దామోదర్ అనే వ్యక్తి రెండో భార్యపై మొదటి భార్య తరఫున కుటుంబ సభ్యులు దాడికి పాల్పడగా.. ఐదుగురు, మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ వరంగంటి రవి సోమవారం తెలిపారు. మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లికి చెందిన రజిత అనే మహిళ భర్త కరోనా సమయంలో చనిపోగా.. అదే గ్రామానికి చెందిన మోకిడి దామోదర్ అనే వ్యక్తి 2024లో రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య జ్యోతి, ఆమె చెల్లి స్వాతి, తల్లి సరోజన, తమ్ముడు శ్రీకాంత్, రాజుతోపాటు మరికొందరు ఈనెల 3న ఇంటికొచ్చి కారం చల్లి, కర్రతో దాడి చేసి బంగారు పుస్తెల తాడు లాక్కొని వెళ్లిపోయారు. బాధితురాలు రజిత ఫిర్యాదు మేరకు ఐదుగురితోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.
సామాజిక ప్రయోజనానికి ప్రాధాన్యం
● ఎల్‌ఐసీ దక్షిణ మధ్య జోన్ మేనేజర్ పునీత్‌కుమార్
కరీంనగర్: సామాజిక ప్రయోజనానికి ఎల్‌ఐసీ ప్రాధాన్యం ఇస్తోందని, గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ కింద పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని సంస్థ దక్షిణ మధ్య జోన్ మేనేజర్ పునీత్‌కుమార్ అన్నారు. కరీంనగర్‌లోని మనోవికాస పాఠశాలకు రూ.24 లక్షల విలువైన బస్సును సోమవారం స్థానిక డివిజినల్ కార్యాలయంలో అందించారు. ఆధునీకరించిన డివిజినల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతామన్నారు. మానసిక వికలాంగ పిల్లల తల్లిదండ్రుల సంఘం ఇన్‌చార్జి పరమేశ్వర్ మాట్లాడుతూ.. మనోవికాస పాఠశాల, వృత్తి విద్య కేంద్రం ప్రస్తుతం 45 మంది పిల్లలకు ఆశ్రయమిస్తోందని, 23 మంది ఉపాధ్యాయులతో నడుస్తోందని తెలిపారు. ఎల్‌ఐసీవారు బస్సును అందజేయడం సంతోషంగా ఉందన్నారు. సీనియర్ డివిజినల్ మేనేజర్ ప్రసాదరావు, చీఫ్ ఇంజినీర్ స్వామి, కార్యాలయ ఇంజినీర్ శేషు, మార్కెటింగ్ మేనేజర్ ఎంఆర్‌కే.శ్రీనివాస్, సేల్స్ మేనేజర్ రాజేశ్ ఖన్నా, క్లాస్–1 అధికారుల సంఘం నాయకులు రాజేందర్, శ్రీహర్ష, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రామ్మోహన్‌రావు, వామన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment