![కులగణన సర్వే మళ్లీ చేయాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10knt251-180090_mr-1739214695-0.jpg.webp?itok=V81uGnAE)
కులగణన సర్వే మళ్లీ చేయాలి
కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే బీసీలకు అన్యాయం చేసేలా ఉందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగు సంపత్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడ ఎన్నం ప్రకాశ్ అన్నారు. సోమవారం కరీంనగర్‌లోని గీతాభవన్‌లో సంఘం ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కులగణన సర్వేలో బీసీల జనాభా శాతాన్ని తగ్గించి చూపారని ఆరోపించారు. హిందూ బీసీ, ముస్లిం బీసీలని.. ప్రపంచంలో ఎక్కడా లేని కొత్త పదాలను సృష్టించారన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 51 శాతం బీసీలుంటే నేడు 46 శాతం చూపించారని, దాదాపు 21 లక్షల మంది బీసీల జనాభా తగ్గిపోయిందని పేర్కొన్నారు. బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రీ సర్వే చేయాలని, హిందూ బీసీ, ముస్లిం బీసీ పదాలను తొలగించాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, బీసీ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు సంజీవ్, బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నారోజు రాకేశ్‌చారి, జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల సురేందర్, ప్రచార కార్యదర్శులు బండారి మల్లయ్య, నల్లవెల్లి రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment