![రైలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10mnt02-180073_mr-1739214692-0.jpg.webp?itok=1qngpdUw)
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మండలం సాంబయ్యపల్లి గ్రామ శివారులోని అండర్ బ్రిడ్జి వద్ద గల కరీంనగర్–పెద్దపల్లి రైల్వే పట్టాలపై 60–65 మధ్య వయస్సున్న గుర్తుతెలియని వ్యక్తిని ఆదివారం రాత్రి కరీంనగర్–తిరుపతి ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిందని రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. రైల్వే పోలీసులకు ట్రైన్ డ్రైవర్ తెలిపారన్నారు. మృతుడు పసుపు రంగు హాఫ్ షర్ట్, గీతల డిజైన్ గల నెక్కర్ ధరించి ఉన్నాడని, మృతుడి వద్ద ఎలాంటి ఐడీ కార్డుల్లేవని తెలిపారు. ప్రస్తుతం మృతదేహాన్ని రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో భద్రపరిచామని, వివరాలు తెలిస్తే 9949304574, 8712658604 నంబర్లకు సమాచారమందించాలని కోరారు.
గుండెపోటుతో యువకుడు..
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ పట్ట ణంలోని జవహర్‌నగర్‌కు చెందిన కొయ్యాడ అనిల్(29) అనే యువకుడు సో మవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందిన ట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం తండ్రి నారాయణతోపాటు టిఫిన్ చేసిన అనిల్.. గ్యాస్‌పై చాయ్ పెట్టి వచ్చి కుర్చీలో కూర్చొని సెల్‌ఫోన్ చూస్తున్నాడు. ఒక్కసారిగా చేతిలో నుంచి సెల్‌ఫోన్ జారి కింద పడగా.. తండ్రి ఏమైందని గట్టిగా అరిచాడు. చుట్టుపక్కలున్నవారు వచ్చి వెంటనే సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. నారాయణకు ఇద్దరు కొడుకులు కాగా.. పెద్ద కుమారుడు ఉద్యోగరీత్యా కరీంనగర్‌లో ఉంటున్నాడు. చిన్న కొడుకుతో నారాయణ ఉంటున్నాడు. అనిల్ డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు.
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ యథావిధిగా కొనసాగింపు
జమ్మికుంట(హుజూరాబాద్): సికింద్రాబాద్ టూ సిర్పూర్ కాగజ్‌నగర్ వరకు వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ యథావిధిగా కొనసాగింపుపై బీజేపీ జిల్లా మోర్చా ప్రధాన కార్యదర్శి రాజేందర్, సంపత్‌రావు సోమవారం హర్షం వ్యక్తం చేశారు. రైల్వే అభివృద్ధి పనులతో ఆటంకముందని రైల్వే అధికారులు అనాలోచిత నిర్ణయంతో సికింద్రాబాద్ టూ సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను 11 రోజులు రద్దు చేయడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా.. రైల్వే అధికారులతో మట్లాడి యధావిధిగా నడిపించేందుకు అధికారిని ఆదేశించారన్నారు. బండి సంజయ్‌కి బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
తేనెటీగల దాడి.. నలుగురికి అస్వస్థత
మంథని: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం ఆటలు ఆడుతున్న వారిపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో మంథని పట్టణానికి చెందిన నూరజ్, తాజ్, యశ్వంత్, శంకర్ అస్వస్థతకు గురయ్యారు. బాధితులను స్థానిక సామాజిక వైద్యశాలకు తరలించి, చికిత్స అందించారు. మంత్రి శ్రీధర్‌బాబు సోదరుడు శ్రీనుబాబు ఆస్పత్రికి వెళ్లి, వారిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి, ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. గోదావరిఖని వైద్యులతో మాట్లాడి, అక్కడికి తరలించారు.
![రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి 1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10pdp702-180122_mr-1739214692-1.jpg)
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
![రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి 2](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10pdp701-180122_mr-1739214693-2.jpg)
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
Comments
Please login to add a commentAdd a comment