జాతీయస్థాయి జూడో పోటీల్లో రజత పతకాలు
కరీంనగర్‌కల్చరల్: ఇటీవల చైన్నెలో జరిగిన జాతీయస్థాయి అండర్ 16, 14 జూడో పోటీల్లో కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు రేవతిరెడ్డి, అంకితనాయక్‌లు రజత పతకాలు సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి వి.శ్రీనివాస్‌గౌడ్, అథ్లెటిక్ కోచ్ డి.పవన్, జూడో కోచ్, సాయిరాం యాదవ్, ఖేలో ఇండియా సెంటర్ జూడో కోచ్ శ్యాం తదితరులు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరం
కరీంనగర్‌టౌన్: నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా మంగళవారం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 11మంది సభ్యులు రక్తదానం చేశారు. రెడ్‌క్రాస్ సెక్రటరీ ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ 18–60 ఏళ్ల వయస్సు గల ఆరోగ్యంగా ఉన్న ప్రతీఒక్కరు రక్తదానం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ చైర్మన్ పెండ్యాల కేశవరెడ్డి, ఎంఎల్‌ఎన్.రెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ మెంబర్స్ సత్యనారాయణరావు, చంద్రశేఖర్, శ్రీనివాస్ గౌడ్, రెడ్‌క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.
బావిలో పడిన మహిళను కాపాడిన ఫైర్ సిబ్బంది
కరీంగనర్‌క్రైం: కట్టరాంపూర్‌కు చెందిన రమాదేవి ప్రమాదవశాత్తు మంగళవారం తెల్లవారుజామున బావిలో పడగా ఫైర్ సిబ్బంది వచ్చి కాపాడారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున రమాదేవి ఇంట్లో కనబడక పోవడంతో తలపులు తీసి బయటికి వెళ్లి చూడగా రమాదేవి బావిలో పడి ఉంది. బావిలో పైపును పట్టుకొని ఆరవడంతో స్థానికుల సహాయంతో ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. ఫైర్ సిబ్బంది బావిలోకి దిగి మహిళకు కాపాడినట్లు ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
పరామర్శ
కరీంనగర్: జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహ న్ కలిసి పరామర్శించారు. ఇటీవల ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తండ్రి పురుషోత్తంరెడ్డి మరణించడంతో ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఆయన వెంట లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.
దుస్తులు పంపిణీ
కరీంనగర్ కార్పొరేషన్: బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా 35వ డివిజన్‌లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డి మంగళవారం తన నివాసంలో కొత్త బట్టలు అందచేశారు. ప్రతీ సంవత్సరం మా దిరిగానే ఈ సారి కూడా కార్మికులకు పండుగ బట్టలు అందచేసినట్లు బుచ్చిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment