ట్రాక్టర్ల బ్యాటరీలు, పట్టీలు చోరీ
గన్నేరువరం(మానకొండూర్): మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో 14 ట్రాక్టర్లకు చెందిన హైడ్రాలిక్ పట్టీలు, 5 బ్యాటరీలు చోరీకి గురైనట్లు ఎస్సై తాండ్ర నరేశ్ తెలిపారు. వివిధ రకాల ధాన్యంతో లోడు చేసిన ట్రాక్టర్లను సంబంధిత యజమానులు ఆదివారం గునుకుల కొండాపూర్ నుంచి చీమలకుంటపల్లె గ్రామానికి వెళ్లే రహదారి పక్కన నిలిపి ఉంచారు. సోమవారం ఉదయం చూసే సరికి ట్రాక్టర్లకు సంబంధించిన బ్యాటరీలు, పట్టీలు లేవు. చోరీకి గురైనట్లు గుర్తించారు. గ్రామ ట్రాక్టర్స్ యునియన్ సభ్యుడు సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
గంజాయి విక్రేత అరెస్ట్
మేడిపల్లి(వేములవాడ): గంజాయి విక్రేతను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ యూసఫ్ వ్యసనాలకు అలవాటు పడి ఈజీగా డబ్బు సంపాదించేందుకు గంజాయి అమ్మడం అలవాటు చేసుకున్నాడు. సోమవారం ఉదయం భీమారం మండలంలో గంజాయి విక్రయించేందుకు వస్తుండగా తనిఖీల్లో భాగంగా మేడిపల్లి మండలకేంద్రంలోని పెట్రోల్ బంకు సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 160 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు మెట్‌పల్లి డీఎస్పీ ఉమామహేశ్వర్‌రావు తెలిపారు. సమావేశంలో సీఐ సురేశ్‌బాబు, ఎస్త్సె శ్యాంరాజ్, సిబ్బంది చంద్రశేఖర్, అనిల్ పాల్గొన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
సిరిసిల్లక్రైం: జీవనోపాధి కోసం చేసిన అప్పులు అధికమవడంతో అవి తీర్చే మార్గం లేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం జరిగింది. పోలీసుల వివరాలు.. తంగళ్లపల్లి మండలం కందికట్కూరుకు చెందిన వెలిశాల సుధాక ర్ (40) సిరిసిల్ల పరిధిలోని చందంపేటలో కట్టె కోత మిషన్ నిర్వహిస్తూ 20 ఏళ్లుగా జీవనోపాధి పొందుతున్నాడు. వ్యాపార నిమిత్తం బ్యాంకుల్లో చేసిన అప్పుల అధికమవడంతో వాయిదాలు చెల్లించడం ఇబ్బందిగా మారింది. దీనికి తోడు ఆరోగ్యం సహకరించకపోవడంతో వ్యా పారం మరింత దెబ్బతిన్నది. దీంతో అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపం చెంది చంద్రంపేటలో కట్టెకోత మిషన్ షెడ్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య లత, 8 ఏళ్ల కొడుకు, ఐదేళ్ల కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ కృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment