రుణాల రెన్యువల్‌కు అవకాశం ఇవ్వండి
● బ్యాంకర్లతో డీఆర్వో వెంకటేశ్వర్లు
కరీంనగర్ అర్బన్: రైతులు తమ రుణాలు రెన్యువల్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని డీఆర్వో బి.వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో రైతులకు, స్వయం సహాయక సంఘాలకు రుణాలు, రికవరీ, పీఎంజీపీవై రుణాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నారిటీ సంక్షేమ శాఖల పథకాలకు సంబంధి ంచి రుణ లక్ష్య పురోగతిపై డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయ న మాట్లాడుతూ.. రుణాల రెన్యువల్‌పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతుబంధు, రైతు బీమా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధులను పంట రుణాలకు జమ చేసుకోవడానికి వీల్లేదని, బ్యాంకర్లు నిబంధనలు పాటించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టె ంబర్ వరకు రూ.6,290.97 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర లక్ష్యం 58.60 శాతం పూర్తయిందని, పెండింగ్ రుణాల ప్రతిపాదనలు బ్యాంకర్లకు అందించి, త్వరగా మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యువతకు ఉపాధి కల్పించే విషయంలో చొరవ చూ పాలన్నారు. ప్రధానమంత్రి స్వనిధి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని సూచించా రు. ఎల్‌డీఎం ఆంజనేయులు, ఆర్‌బీఐ అధి కారి పల్లవి, నాబార్డు ఏజీఎం ప్రకాశ్, ఎస్‌బీ ఐ సీఎం రామచంద్రుడు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment