ఐఎంఏ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం | - | Sakshi
Sakshi News home page

ఐఎంఏ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

Published Thu, Nov 7 2024 12:22 AM | Last Updated on Thu, Nov 7 2024 12:22 AM

ఐఎంఏ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

ఐఎంఏ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

కరీంనగర్‌టౌన్‌: ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) కరీంనగర్‌ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం బుధవారం రాత్రి స్థానిక కశ్మీర్‌గడ్డలోని ఐఎంఏ హాల్‌లో జరిగింది. బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ చీఫ్‌ గెస్ట్‌గా హాజరయ్యారు. ఐఎంఏ అధ్యక్షుడిగా ఎనమల నరేశ్‌, ఉపా ధ్యక్షులుగా జి.వెంకట్‌రెడ్డి, ఎలగందుల శ్రీని వాస్‌, ప్రధానకార్యదర్శిగా నవీన్‌కుమార్‌, ట్రెజరర్‌గా విజ య్‌కుమార్‌, సభ్యులతో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కాళి ప్రసాద్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం చేశారు. మంత్రి ప్రభాకర్‌ మాట్లాడు తూ.. హైదరా బాద్‌ తర్వాత ఉత్తర తెలంగాణలో కరీంనగర్‌ మెడికల్‌ హబ్‌గా మారిందన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచి ంచారు. వైద్యుల సమస్యలు పరిష్కరిస్తామని హా మీ ఇచ్చారు. మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, డాక్టర్‌ బీఎన్‌.రావు, పి.కిషన్‌, రాంకిరణ్‌, ఎడవెల్లి విజెందర్‌రెడ్డి, కవిత, మల్లిఖార్జున్‌, ఝాన్సీ, ఎల్‌.వర్షి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement