● రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
● కలెక్టర్ పమేలా సత్పతి ● చిగురుమామిడి పీహెచ్‌సీ తనిఖీ ● సమగ్ర కుటుంబ సర్వే పరిశీలన
చిగురుమామిడి(హుస్నాబాద్): రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. చిగురుమామిడి పీహెచ్‌సీని బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఫార్మసీ, ఓపీ, ల్యాబ్, లేబర్ రూంలను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. స్టాక్ రిజిస్టర్‌లో జిల్లా కేంద్రం నుంచి వచ్చే మందుల వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. తాము ఇచ్చిన ఐ డ్రాప్స్ వివరాలను ఎందుకు నమోదు చేయలేదని మెడికల్ ఆఫీసర్ సందీప్‌రెడ్డిని ప్రశ్నించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు రేకొండ పెద్దమ్మపల్లె 13వ, చిగురుమామిడిలోని 10వ వార్డులో సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు. సేకరించిన ప్రజల వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఎన్యుమరేట్లకు సరైన సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో వివరాలు తప్పుగా నమోదు చేయవద్దని, సందేహాలుంటే సూపర్‌వైజర్లను గానీ, ఎంపీడీవోలను గానీ సంప్రదించాలన్నారు. అదనపు కలెక్టర్ ప్రపుల్‌దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్‌యాదవ్, ఎంపీడీవో మధుసూదన్, ఆర్‌ఐ సంతోష్‌కుమార్, పంచాయతీ కార్యదర్శులు అజయ్, రమేశ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment