● బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే ధాన్యం
● మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ● ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి ఆర్వీ కర్ణన్
కరీంనగర్ అర్బన్: బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ చేసిన రైస్ మిల్లర్లకే ప్రభుత్వం ధాన్యం కేటాయిస్తుందని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. ధాన్యం మిల్లింగ్‌పై సివిల్ సప్లయ్ అధికారులు, కొనుగోలు ఏజెన్సీల అధికారులు, మిల్లర్లతో కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వడ్లను తప్ప, తాలు, తేమ లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించాలన్నారు. ఎటువంటి బకాయిల చరిత్ర లేని మిల్లర్లు, మిల్లింగ్ సామర్థ్యంపై 10 శాతం బ్యాంకు గ్యారంటీ లేదా 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని పేర్కొన్నారు. మిల్లుల వద్ద కోత విధించాలని ప్రయత్నిస్తే మిల్లర్లపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. రైస్ మిల్లర్ల సంఘం బాధ్యులు పలు సమస్యలను ప్రస్తావించగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అడిషనల్ కలెక్టర్ ప్రపుల్‌దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, సివిల్ సప్లయ్ డీఎం రజనీకాంత్, డీఎస్‌వో నర్సింగరావు, డీసీవో రామానుజాచారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment