‘అల్ఫోర్స్’లో ఏఐపై అవగాహన సదస్సు
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ సూర్యనగర్‌లోని అల్ఫోర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో స్వేచ్ఛ ఆర్గనైజేషన్, టాస్క్ సంయుక్త ఆధ్వర్యంలో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కరస్పాండెంట్ వి.రవీందర్ రెడ్డి ప్రారంభించగా.. ముఖ్య అతిథిగా హాజరైన టాస్క్ రీజినల్ కో–ఆర్డినేటర్ గంగాప్రసాద్ టాస్క్ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఐఐటీ హైదరాబాద్ రీసెర్చ్ స్కాలర్స్ వామన్ అఖిల్, నిఖిల్ ఆనంద్, హర్షితలు ఏఐపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెలుగు భాషను, మన సంస్కృతి, సంప్రదాయాలను ఏఐని ఉపయోగించి, ఎలా పరిరక్షించుకోవాలో చెప్పారు. భాష వారసత్వాన్ని కాపాడుకోవడం కోసం ప్రాజెక్టుకు సంబంధించిన ఇంటర్న్‌షిప్‌లు అందిస్తున్నట్లు తెలిపారు. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏఐ, డేటా సైన్స్‌ను విద్యార్థులే కాదని, కోర్సుకు సంబంధం లేనివారు కూడా ఉపయోగించుకొని, తమ రంగంలో రాణించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment