నేటి ప్రజావాణి రద్దు
కరీంనగర్‌అర్బన్: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కొనసాగుతున్నందున సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని పేర్కొన్నారు. సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలని, ఎన్యుమరేటర్లకు సమాచారమివ్వాలని కోరారు.
శాంతిభద్రతలకు
విఘాతం కలిగిస్తే చర్యలు
హుజూరాబాద్‌రూరల్: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌జి అన్నారు. పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. శనివారం పట్టణంలోని కరీంనగర్–వరంగల్ ప్రధాన రహదారిపై చేసిన ధర్నా, రాస్తారోకోలతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తాయని, అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, హైవేలు, ఇతర మార్గాల మీద జనం గుమిగూడిన ధర్నా, రాస్తారోకోలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
స్టడీ సర్కిల్‌ను వినియోగించుకోవాలి
కరీంనగర్: గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ప్రతిమ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ప్రతిమ స్టడీ సర్కిల్‌లో చదివి ఇటీవల డీఎస్సీ ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్, పీఈటీ ఉద్యోగాలు సాధించిన వెంకటేశ్, అప్రోజ్‌ను ఆదివారం తన కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిమ స్టడీ సర్కిల్‌లో ప్రశాంత వాతావరణంలో అన్ని వసతులతో పాటు ఉచితంగా పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలను అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసిన ఏడేళ్లలో ఇప్పటివరకు 410 మంది ఉద్యోగాలు సాధించారని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జక్కుల నాగరాజుయాదవ్, అశోక్, సాయి, ప్రశాంత్, సాగర్, అక్షయ్, రమేశ్, రాజు, శ్రీకాంత్, విజయ్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment