అమ్మా... పరిష్కరించండి! | - | Sakshi
Sakshi News home page

అమ్మా... పరిష్కరించండి!

Published Tue, Nov 19 2024 12:13 AM | Last Updated on Tue, Nov 19 2024 12:13 AM

అమ్మా... పరిష్కరించండి!

అమ్మా... పరిష్కరించండి!

● ప్రజావాణికి పోటెత్తిన్న అర్జీలు ● ఒక్కొక్కరిది ఒక్కోసమస్య ● పరిష్కరించాలని వేడుకోలు

కరీంనగర్‌ అర్బన్‌: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజలు ప్రజావాణిని ఆశ్రయించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో అత్యధికం వచ్చిన ఫిర్యాదులే మళ్లీమళ్లీ రావడం విశేషం. సంబంధిత అధికారులు సమస్యలను పరిష్కరించామని కాగితాల్లో చూపుతుండగా ఆచరణలో మాత్రం కానరావడంలేదని అర్జీదారులు వాపోతున్నారు. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, నివేసన స్థలాలు, పింఛన్లు, రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు రాగా పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు కలెక్టర్‌ పమేలా సత్పతి చొరవ చూపారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు లక్ష్మీకిరణ్‌, ప్రపుల్‌ దేశాయ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పేయ్‌, డీఆర్‌వో వెంకటేశ్వర్లు దరఖాస్తులు స్వీకరించగా 180 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్‌ ఏవో సుధాకర్‌ తెలిపారు.

మునిసిపల్‌ కార్పొరేషన్‌ కరీంనగర్‌: 26

వారధి సొసైటీ: 15

జమ్మికుంట మునిసిపాలిటీ: 15

డీపీవో: 13, ఆర్డీవో కరీంనగర్‌: 12

కరీంనగర్‌ రూరల్‌ తహసీల్దార్‌: 10

ఇతర శాఖలకు అర్జీలు: 89

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement