వైద్యులు రాసిన మందులే వాడాలి | - | Sakshi
Sakshi News home page

వైద్యులు రాసిన మందులే వాడాలి

Published Tue, Nov 19 2024 12:13 AM | Last Updated on Tue, Nov 19 2024 12:13 AM

వైద్య

వైద్యులు రాసిన మందులే వాడాలి

కరీంనగర్‌టౌన్‌: యాంటిబయటిక్‌ మందులను క్వాలిఫైడ్‌ వైద్యులు రాసిన ప్రకారమే వాడాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటరమణ అన్నారు. సోమవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో యాంటి మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌కు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా డీఎంహెచ్‌వో మాట్లాడారు. కార్యక్రమంలో అడిషనల్‌ జిల్లా వైద్యాధికారి సుధ, పీవోడీటీటీ ఉమశ్రీ, పీవోఎంసీహెచ్‌ సనజ వేరియా, అధికారులు పాల్గొన్నారు.

రైతులకు అండగా ప్రభుత్వం

కరీంనగర్‌రూరల్‌: ప్రభుత్వం రైతులకు అన్నివిధాలా అండగా ఉంటూ ఆదుకుంటుందని సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కరీంనగర్‌ మండలం చెర్లభూత్కూర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్ల వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. 42 కిలోల ధాన్యం తూకం వేస్తున్నారని పలువురు రైతులు తెలపగా డీఎస్‌వో నర్సింగరావుతో ఫోన్‌లో మాట్లాడారు. నిబంధనల ప్రకారం 41 కిలోల ధాన్యం తూకం వేయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు రైసుమిల్లర్లు, అధికారులు సహకరించాలని కోరా రు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 65వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ప్రస్తుతం 81వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు రైతులకు రూ.62 కోట్లను చెల్లించినట్లు తెలిపారు. సన్నాలు విక్రయించిన రైతులకు నాలుగైదు రోజుల్లో బోనస్‌ రూ. 500 బ్యాంకుఖాతాల్లో జమవుతాయన్నారు. కార్యక్రమంలో కరీంనగర్‌ సింగిల్‌విండో సీఈవో రమేశ్‌, సివిల్‌సప్‌లై ఎఫ్‌ఐ మధు, మాజీ సర్పంచ్‌ దబ్బెట రమణారెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సాయిని తిరుపతి, నాయకులు కూర నరేశ్‌రెడ్డి, రంగారెడ్డి, నర్సింహరెడ్డి, బుర్ర నారాయణ, పద్మ, సరోజన తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ కళాజ్యోతి అవార్డులకు ఆహ్వానం

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): కరీంనగర్‌ ఫోకార్ట్స్‌ అకాడమీ ప్రతి ఏటా ప్రదానం చేసే గ్రామీణ కళాజ్యోతి అవార్డులకు అర్హత ఉన్నవారి నుంచి ఎంట్రీలకు ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు జి.కృపాదానం తెలిపారు. కరీంనగర్‌ ఫోకార్ట్స్‌ అకాడమీ 41వ వార్షికోత్సవం సందర్భంగా అవార్డులను ప్రదానం చేయనున్నట్లు, వివిధ కళారంగాలు, సామాజిక విభాగాల్లో నుంచి ఎంట్రీలు కోరుతున్నట్లు పేర్కొన్నారు. జీవిత సాఫల్య పురస్కారం పద్య నాటకం వయసు 58 సంవత్సరాలు దాటి ఉండాలని, యువ పద్య నాటక గ్రామీణ కళాజ్యోతి అవార్డుకు 35 సంవత్సరాలు దాటొద్దని, యువజన సాంఘిక సేవా పురస్కారాలకు 35 సంవత్సరాల్లోపు ఉండి గ్రామీణ ప్రాంతంలో సేవా కార్యక్రమంలో పాల్గొన్నవారు అర్హులన్నారు. ఈనెల 22 లోపు తమ ఎంట్రీలను జి.కృపాదానం, రేకుర్తి, కొత్తపల్లి మండలం కరీంనగర్‌ జిల్లాకు పోస్ట్‌ ద్వారా పంపాలని, పూర్తి వివరాలకు 8106006238 నంబర్‌ను సంప్రదించాలని ఈ సందర్భంగా సూచించారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎస్‌ఆర్‌ఆర్‌ విద్యార్థులు

కరీంనగర్‌సిటీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) స్థాపించి 90 ఏళ్లయిన సందర్భంగా ఆర్‌బీఐ ఆధ్వర్యంలో 90వ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించింది. సెప్టెంబర్‌ 19 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌ ఆధారంగా జరిగిన ప్రాథమిక క్విజ్‌ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అండర్‌ గ్రాడ్యుయేట్‌ల బృందాలకు సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి (స్టేట్‌ లెవెల్‌ రౌండ్‌)పోటీలు నిర్వహించారు. స్టేట్‌ లెవెల్‌ రౌండ్‌లో ఎస్సారార్‌ కళాశాల నుంచి బీబీఏ విద్యార్థులు జె.విశ్వతేజ, జె.సిద్ధార్థ పాల్గొన్నట్లు కళాశాల ప్రతినిధిగా పాల్గొన్న కామర్స్‌ అధ్యాపకుడు బూర్ల నరేశ్‌ తెలిపారు. నగరంలోని హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్‌, నోవాటెల్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో 90 బృందాలకు చెందిన 180 మంది పాల్గొన్నట్లు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వైద్యులు రాసిన   మందులే వాడాలి1
1/2

వైద్యులు రాసిన మందులే వాడాలి

వైద్యులు రాసిన   మందులే వాడాలి2
2/2

వైద్యులు రాసిన మందులే వాడాలి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement