పెండింగ్ పనులు పూర్తిచేస్తాం
● మేయర్ యాదగిరి సునీల్‌రావు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను వచ్చే ఏడాది జనవరి 10వ తేదీలోగా పూర్తిచేసి .. ప్రారంభిస్తామని మేయర్ యాదగిరి సునీల్‌రావు తెలిపారు. సోమవారం నగరంలోని 14వ డివిజన్ మంకమ్మతోటలో స్మార్ట్ సిటీ నిధులతో చేపడుతున్న రాజీవ్ పార్క్ ఆధునీకరణ పనులను తనిఖీ చేశారు. స్మార్ట్ సిటీ నిధులు రూ.1.10 కోట్లతో రాజీవ్‌పార్క్‌ను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ పార్క్ పనులు వచ్చే నెల 15వ తేదీలోగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకవస్తామన్నారు. ప్రతీ రోజు తాగునీటి సరఫరా చేస్తున్న ఏకై క నగరం దేశంలోనే కరీంనగర్ ఒక్కటేనన్నారు. రూ.18 కోట్లతో హౌసింగ్‌బోర్డు రిజర్వాయర్ పరిధిలో ఐదు వేల గృహాలకు 24 గంటల తాగునీటి సరఫరా చేస్తామని ఆయన వెల్లడించారు. త్వరలోనే 24 గంటల తాగునీటి సరఫరా చేసే నగరంగా కరీంనగర్ మారబోతుందున్నారు. నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతున్న మల్టిపర్పస్ పార్క్ పనులు కూడా పూర్తి కావస్తున్నాయని.. ప్రజలకు ఈ పార్క్‌ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రూ.15 కోట్లతో పద్మనగర్ బుల్‌సెమెన్ స్థలంలో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్‌ను వచ్చేనెల చివరి వారంలో లేదంటే, జనవరి మొదటి వారంలో ప్రారంభిస్తామన్నారు. అంబేడ్కర్ స్టేడియంలో రూ.14 కోట్లతో నిర్మించిన వాణిజ్య సముదాయాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. నగరంలోని వీధి వ్యాపారుల కోసం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వెనుకాల, శాతవాహన యూనివర్సిటీ వద్ద నిర్మించిన దుకాణాలను జనవరిలోగా కేటాయిస్తామన్నారు. హైలెవెల్ జోన్‌లో ఏఈల కోసం నిర్మించిన క్వార్టర్‌ను కూడా ప్రారంభిస్తామన్నారు.కార్యక్రమంలో నగరపాలకసంస్థ ఈఈ సుబ్రమణ్యన్, డీఈ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు దిండిగాల మహేశ్, వాల రమణారావు, మాజీ కార్పొరేటర్ రమేశ్‌రెడ్డి, సల్ల రవీందర్, సుదగోని కృష్ణగౌడ్ తదితరులు
పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment