‘పది’ పరీక్ష ఫీజు..
ఇష్టారీతిన వసూలు
● తీసుకోవాల్సింది రూ.125 ● ప్రైవేటు పాఠశాలల్లో తీసుకుంటున్నది రూ.500–రూ.1,000 ● పట్టించుకోని విద్యాశాఖ అధికారులు ● జిల్లాలో 12 వేల మందికి పైగా పదోతరగతి విద్యార్థులు
‘కరీంనగర్ పట్టణం మంకమ్మతోటలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థిని కొన్ని రోజులుగా స్కూల్‌కు వెళ్లడం లేదు. కారణం ఏంటని అమ్మానాన్న ఆరా తీస్తే పరీక్ష ఫీజు చెల్లిస్తేనే వెళ్తానని, లేకపోతే తనను తరగతి గదిలో అందరి ముందు నిలబెట్టి పలుమార్లు అడుగుతున్నారని ఏడుస్తూ బదులిచ్చింది. దీంతో చేసేదేమీ లేక వారు రూ.1,000 పరీక్ష ఫీజు కట్టారు.’
‘పదోతరగతి పరీక్ష ఫీజు కట్టలేదన్న కారణంతో ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఓ విద్యార్థిని పాఠశాలకు రావొద్దని ఆంక్షలు విధించింది. రూ.1,000 ఫీజు చెల్లిస్తే పిల్లవాడి పేరు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని, లేకుంటే సంవత్సరం చదువు వృథా అవుతుందని చెప్పడంతో తండ్రి ఆందోళనకు గురయ్యాడు. అప్పు చేసి, ఫీజు చెల్లించాడు.’ ఇది ఈ ఇద్దరి విద్యార్థుల బాధనే కాదు.. జిల్లాలోని 12 వేల మందికి పైగా ప్రైవేట్ పాఠశాలల పదోతరగతి విద్యార్థులది.
Comments
Please login to add a commentAdd a comment