ప్రభుత్వ ఆస్పత్రిలో యోగా
● నేటి నుంచి తరగతులు ప్రారంభం
కరీంనగర్‌టౌన్: ప్రజల ఆరోగ్యరీత్యా యోగా ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోగా కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాయి. నేషనల్ ఆయుష్ మిషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. నగరంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రి రెండో అంతస్తులో గల ఆరోగ్య మహిళా విభాగంలో యోగా గదిని ఏర్పాటు చేశారు. శనివారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రతీరోజు ఉదయం ఇద్దరు శిక్షకులతో మహిళలకు, పురుషులకు వేర్వేరుగా శిక్షణనిస్తారు. ఇప్పటికే జిల్లా ఆయుష్ డైరెక్టర్ ద్వారా మహిళా ట్రైనర్‌గా అక్షయ, పురుషులకు ట్రైనర్‌గా అంజయ్య నియమితులయ్యారు. నిత్యం యోగాతో దీర్ఘకాలిక రోగాలకు చెక్ పెట్టవచ్చని ఆస్పత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్‌ఎంవో రవీన, యునాని మెడికల్ ఆఫీసర్ యస్రబ్‌సుల్తానా, డీపీఎం ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతీరోజు నిర్వహించే యోగా శిక్షణను పేషెంట్లు, వారికి తోడుగా వచ్చేవారు, ఇతర అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment