రూ.800 కోట్ల పనులు పూర్తి చేశాం
● జనవరిలో కమాండ్ కంట్రోల్ భవనం ప్రారంభిస్తాం ● స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుపై మేయర్ యాదగిరి సునీల్‌రావు
కరీంనగర్ కార్పొరేషన్: స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరంలో రూ.800 కోట్ల పనులు పూర్తి చేశామని మేయర్ యాదగిరి సునీల్‌రావు అన్నారు. మరో రూ.134 కోట్ల అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. రూ.16 కోట్లతో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ భవనాన్ని జనవరి రెండో వారంలోగా ప్రారంభిస్తామన్నారు. శుక్రవారం నగరంలోని తీగలవంతెన సమీపంలో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ భవనాన్ని ఆయన సందర్శించారు. పనుల్లో జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌తో సమన్వయం చేసుకోవాలని పీఎంసీ అధికారులకు సూచించారు. అనంతరం మాట్లాడుతూ.. కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణం 70 శాతం పూర్తయిందని తెలిపారు. వచ్చే జనవరిలోగా హౌసింగ్‌బోర్డు రిజర్వాయర్ పరిధిలో 5 వేల ఇళ్లకు 24 గంటల తాగునీరందిస్తామని పేర్కొన్నారు. వరంగల్‌తో పోల్చితే స్మార్ట్‌సిటీ పనులు కరీంనగర్‌లోనే వేగంగా జరిగాయని తెలిపారు.
అధికారులపై ఆగ్రహం..
నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ను మేయర్ సునీల్‌రావు పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ అంటే ఏమిటి.. స్క్రీన్‌పై చూసుడే కాదు కదా.. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, నగరంలో చేపట్టిన, మీరు చేసిన పనులేమిటని మేయర్ సునీల్‌రావు కమాండ్ కంట్రోల్ అధికారులను ప్రశ్నించారు. ట్రాఫిక్ సిగ్నల్స్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ఫ్రీ వైఫై స్పాట్స్ తదితరాలపై సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కమాండ్ కంట్రోల్ పనితీరుపై పూర్తిస్థాయి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఆయన వెంట కార్పొరేటర్ ఐలేందర్‌యాదవ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment