పిల్లలు, మహిళల ఆరోగ్యమే లక్ష్యం
వీణవంక(హుజూరాబాద్): పిల్లలు, మహిళల ఆరోగ్యమే లక్ష్యమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. వీణవంక మండలంలోని ఎల్బాక అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కాసేపు చిన్నారులతో గడిపారు. గర్భిణులు, బాలింతలు, మహిళల సమస్యలు తెలుసుకున్నారు. ప్రతీ మహిళ అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చి, ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఆరోగ్య మహిళ స్కీం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 55 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారని, ఆరోగ్య శ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తారని పేర్కొన్నారు. గ్రామంలో 13 ఏళ్లు దాటినవారు 720 మంది ఉండగా 520 మందికి వైద్య పరీక్షలు చేసిన సిబ్బందిని ఆమె అభినందించారు. స్థానికులు ముగ్గురికి కేన్సర్ సోకినట్లు గుర్తించామని వైద్య సిబ్బంది కలెక్టర్‌కు తెలిపారు. ప్రాథమిక దశలో గుర్తిస్తే కేన్సర్ చికిత్సతో నయమవుతుందని, నిర్లక్ష్యం చేయొద్దన్నారు. అనంతరం గర్భిణులకు సీమంతం చేశారు. చిన్నారులకు అన్నప్రాసన చేయించారు. పిల్లల దత్తతకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సందర్శించి, టీచర్లకు పలు సూచనలు చేశారు. సీపీవో కొంరయ్య, ఆర్డీవో రమేశ్‌బాబు, డీఎంహెచ్‌వో వెంకటరమణ, అడిషనల్ డీఆర్‌డీవో సునీత, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీవో సురేందర్, అంగన్‌వాడీ టీచర్లు ఉన్నారు.
కలెక్టర్ పమేలా సత్పతి
ఎల్బాక అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం సభ
Comments
Please login to add a commentAdd a comment