చావుకు కారకులను ఎలా వదిలేస్తారు ?
సిరిసిల్లటౌన్/గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలం రాజేశ్వరావునగర్‌లో రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో పోలీసుల తీరుపై బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రమాదంలో మృతిచెందిన చల్ల రమేశ్(34) బంధువులు, గ్రామస్తులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ సిరిసిల్లలోని అంబేడ్కర్‌చౌరస్తాలో శనివారం ఽరాస్తారోకో చేపట్టారు. గంభీరావుపేట మండలం రాజేశ్వర్‌రావునగర్, మల్లుపల్లి గ్రామాల మధ్య శుక్రవారం అర్ధరాత్రి రెండు బైక్‌లు ఢీకొన్న సంఘటనలో చల్ల రమేశ్ మృతిచెందాడు. మృతుడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మృతునికి తల్లి రామవ్వ, భార్య రజిత, కూతుళ్లు మేనక, రిషిక, కొడుకు రిషి ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
నిందితుడిని ఎలా వదిలేస్తారు?
రమేశ్ మృతిచెందినా ప్రమాదానికి కారణమైన వ్యక్తిని ఎలా వదిలేస్తారని ప్రశ్నిస్తూ మృతుడి బంధువులు, గ్రామస్తులు సిరిసిల్లలో ధర్నాకు దిగారు. పోలీసుల తీరు సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గంటకుపైగా బైఠాయించడంతో పెద్ద ఎత్తున ట్రాఫక్ జామ్ అయ్యింది. సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ వచ్చి బాధిత కుటుంబ సభ్యులు, ఆందోళనకారులతో మాట్లాడి రాస్తారోకో విరమింపజేశారు.
సిరిసిల్లలో
రాజేశ్వర్‌రావునగర్ వాసుల ధర్నా
పోలీసుల తీరుపై పెల్లుబికిన ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment