ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడిగా నవీన్‌రెడ్డి
రాయికల్(జగిత్యాల): ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్ యూకే యూత్ అధ్యక్షుడిగా నవీన్‌రెడ్డి నియామకమయ్యారు. ఉపాధ్యక్షులు గా నవాపేట రవి, సతీశ్‌రెడ్డి, చిలుముల సత్యమూర్తి, రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా కడుదుల రత్నాకర్, అడ్వైజరీ బోర్డు చైర్మన్‌గా సిక చంద్రశేఖర్‌గౌడ్, వైస్ చైర్మన్లుగా జల్ల శ్రీకాంత్, కుప్పాల గణేశ్‌ను నియమించినట్లు ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్ కో ఆర్డినేటర్ బింగాల మహేశ్, వ్యవస్థాపక అధ్యక్షుడు కూర్మాచలం అనిల్ ప్రకటించారు.
హెడ్ రెగ్యులేటర్ వద్ద
కుళ్లిన మృతదేహం
చొప్పదండి: రెవెళ్లి హెడ్ రెగ్యులేటర్ వద్ద గల కాకతీయ కాలువలో కుళ్లిపోయిన మృతదేహం గుర్తించినట్లు ఎస్‌ఐ గొల్లపల్లి అనూష తెలిపారు. కాకతీయ కాలువ వద్ద లష్కర్‌గా పని చేసే కనకయ్య అస్థిపంజరం రూపంలో ఉన్న మృతదేహం గుర్తించాడు. కార్యదర్శి అనిల్ ద్వారా పోలీసులకు సమాచారమందించారు. మృతదేహం పూర్తిగా కుళ్లి గుర్తుపట్టేలా లేదని, మృతుడి వయస్సు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిపారు. ఒంటిపై నలుపు రంగు ప్యాంట్ ఉందని, ఎవరికై నా మిస్సింగ్ అనుమానాలుంటే చొప్పదండి పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
కరీంనగర్ క్రైం: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. కరీంనగర్ టూటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని భగత్‌నగర్‌కు చెందిన కాసం రాఘవేందర్‌రెడ్డి ఓ డెయిరీ ఫాంలో పని చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం పని ముగించుకొని, ఇంటికి వచ్చాడు. బయటకు వెళ్లి వస్తానని కుటుంబసభ్యులకు చెప్పి, బైక్‌పై వెళ్లాడు. కానీ, తిరిగి రాలేదు. అదేరోజు రాత్రి రాంనగర్‌లో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అతని తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య సౌమ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
మహిళ అదృశ్యం
బోయినపల్లి: మండలంలోని జగ్గారావుపల్లి గ్రామానికి చెందిన దొంతరవేని ఎల్లవ్వ అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పృథ్వీధర్ శనివారం తెలిపారు. ఎల్లవ్వ ఈనెల 22న ఎల్లవ్వ అదృశ్యమైనట్లు ఆమె కుమారుడు దొంతరవేని కనుకరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆచూకీ తెలిపిన వారు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.
గంజాయి విక్రేత అరెస్టు
ఇల్లంతకుంట: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ మొగిలి తెలిపారు. మండలంలోని ముస్కానిపేటలో గుండారంకు చెందిన మహ్మద్ అల్పహద్ గంజాయి విక్రయించేందుకు యత్నిస్తుండగా ఎస్సై పట్టుకున్నారన్నారు. అతని వద్ద నుంచి 110 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment