చేతికందిన కొడుకు కానరాని లోకాలకు..
వెల్గటూర్(ధర్మపురి): చేతికందిన కొడుకు తమకు ఆసరాగా ఉంటాడనుకున్న సమయంలో రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఒక్కగానొక్క కొడుకు దూరమైన ఆ కన్నవారి కన్నీళ్లు తుడిచేవారు లేకుండా పోయారు. పోలీసులు, స్థానికుల వివరాలు.. పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూర్‌కు చెందిన నల్లపు అవినాష్ (19), బడుగు సాగర్, కుదిరె సాగర్ శుక్రవారం రాత్రి వ్యక్తిగత పనిమీద ద్విచక్రవాహనంపై ధర్మపురి మండలం రాయపట్నం వైపు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వెల్గటూర్ మండలం కొత్తపల్లి స్టేజీవద్దకు రాగా ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా హఠాత్తుగా బైక్‌కు ఎదురుగా తిప్పడంతో ట్రాక్టర్ ట్రాలీ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం క్షతగాత్రులను కరీంనగర్, జగిత్యాల ఆస్పత్రులకు తరలించారు. జగిత్యాలలో చికిత్స పొందుతున్న నల్లపు అవినాష్ మృతిచెందగా, బడుగు సాగర్ పరిస్థితి విషమంగా ఉంది. కుదిరె సాగర్ కూడా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. కాగా అవినాష్ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు, ఒక కూతురు. వీరిది నిరుపేద కుటుంబం కాగా, తండ్రి పనిచేయలేని స్థితిలో ఉండగా, ఆ ఇంటికి అవినాష్ మాత్రమే ఆధారం. ఒక్కగానొక్క మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. ఇంతటి ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికీ తెలియరాలేదు. మృతుడి తండ్రి నల్లపు తిరుపతి ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ సురేశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. ఘటనకు గల పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
Comments
Please login to add a commentAdd a comment