రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
రామడుగు/కొత్తపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. రామడుగు మండలంలోని దేశరాజ్‌పల్లికి చెందిన గజ్జెల శేఖర్(26) శనివారం తెల్లవారుజామున బైక్‌పై స్వగ్రామం వస్తున్నాడు. కొత్తపల్లి మండల పరిధిలోని కాకతీయ కాలువ సమీపంలో కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి అమృతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ధర్మారం(ధర్మపురి): ఎర్రగుంటలపల్లి బస్టాండ్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బంజేరుపల్లి తండా బి– గ్రామానికి చెందిన భూక్య రాజేశంనాయక్(35) అక్కడికక్కడే మరణించాడు. రాజేశంనాయక్ తన ట్రాక్టర్ రిపేరు కోసం ధర్మారం వచ్చాడు. మరమ్మతు పూర్తి కాకపోవడంతో మోటార్ సైకిల్‌పై ఇంటికి బయలు దేరాడు. మార్గమధ్యంలోని ఎర్రగుంటపల్లి బస్టాండ్ సమీపంలో కరీంనగర్ నుంచి వస్తున్న డీసీఎం వ్యాన్ అతివేగంగా ఢీకొంది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన రాజేశం నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై లక్ష్మణ్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య సంధ్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.
భూ కబ్జా కేసులో ముగ్గురి అరెస్టు
కరీంనగర్‌క్రైం: భూమికి తప్పుడు ధృవపత్రాలు తయారు చేసి కబ్జా చేసిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు కరీంనగర్ టూటౌన్ పోలీసులు తెలిపారు. కరీంనగర్ ఫతేపురకు చెందిన షేక్ అబూబకర్ 1992లో రేకుర్తిలో 8.12 ఎకరాల భూమిని కొని 1996లో వెంచర్‌గా మార్చి పలువురికి విక్రయించాడు. అందులో 200 గజాల స్థలాన్ని మొదట లక్ష్మీ కొనుగోలు చేయగా తర్వాత లచ్చయ్య ఆపై గుర్రం బాల నరేంధర్‌లు కొనుగోలు చేశారు. అందులో 400 గజాల స్థలం షేక్ అబూబకర్ ఎవరికీ విక్రయించకుండా తన పేరునే ఉంచుకున్నాడు. ఈ స్థలాన్ని తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకొని కబ్జా చేశారని ఆ భూమిలోకి వస్తే చంపేస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని గుర్రం బాల నరేందర్, ఉప్పు శ్రీనివాస్, చిటీ ఉపేంధర్‌రావు, గుర్రం రాజయ్యలపై అబూబకర్ టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈవిషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు నగరానికి చెందిన గుర్రం బాల నరేందర్, ఉప్పు శ్రీనివాస్, చిటీ ఉపేంధర్‌రావులను శనివారం అరెస్టు చేసి జైలుకు తర లించగా మరో నిందితుడు గుర్రం రాజయ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మహిళా ఉద్యోగికి వేధింపులు?
● కలెక్టర్‌కు ఫిర్యాదు!
జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఓ ప్రభుత్వ విభాగంలో పని చేసే మహిళ ఉద్యోగిని అందులో పనిచేస్తున్న వారు లైంగికంగా వేధిస్తున్నారంటూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సదరు మహిళ ఉద్యోగి ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా, 15 రోజుల క్రితం సైతం ఓ శాఖలో మహిళా ఉద్యోగులను వేధింపులకు గురిచేయగా వారు సైతం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment