ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
సాయం చేయాల్సిన దాతలు కదిరె మహేందర్ ఖాతా నం.20331664274 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి, కోడ్: వేములవాడ, 17241 ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్: ఎస్‌బీఐఎన్ 0017241 గూగుల్ పే, ఫోన్ పే నంబర్: 77949 62176
● రెండు కిడ్నీలు పనిచేయక దాతల కోసం ఎదురుచూస్తున్న మహేందర్
● ఇంటి పెద్దను కాపాడాలని కోరుతున్న కుటుంబం
కోనరావుపేట(వేములవాడ): రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద కుటుంబానికి పెద్ద కష్టమొచ్చింది. రెండు కిడ్నీలు చెడిపోయి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కదిరే మహేందర్‌కు ఐదురోజుల క్రితం అనారోగ్య కారణంగా కాళ్లు వాపులు రావడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. పరీక్షల్లో రెండు కిడ్నీలు (ఫెయిల్యూర్) పాడయ్యాయని, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ (కిడ్నీ మార్పిడి) చేయాలని వైద్యులు చెప్పారు. కిడ్నీ మార్పిడి వైద్యానికి సుమారు రూ.30 లక్షల ఖర్చు అవుతుందని తెలిపారు. కూలీ పనులు చేసుకుని జీవించే వారి కుటుంబానికి పెద్ద కష్టం రావడంతో ఆపన్నహస్తం, కిడ్నీ దాతల కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి. అలాగే కిడ్నీ మార్పిడి దాదాపు 30 లక్షల ఖర్చుతో కూడుకున్న వైద్యం కాబట్టి దాతలు సహకారాన్ని అందించాలని మహేందర్ భార్య సంధ్య, కుమారుడు ముఖేశ్, కూతురు మను కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment