కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన
కరీంనగర్: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు నిరసన తెలిపారు. మంగళవారం కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. శాంతియుత నిరసనలను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కార్పొరేట్ల ప్రయోజనం కోసం దేశ స్వాతంత్య్రాన్ని, స్వావలంబనను తాకట్టు పెడుతోందన్నారు. పౌరహక్కుల ఉద్యమనేత ప్రొఫెసర్ సాయిబాబా మరణానికి కేంద్రమే కారణమని మండిపడ్డారు. అత్యంత కీలకమైన వ్యవసాయం, పారిశ్రామిక, అసంఘటిత రంగ కార్మికులకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. ప్రజాసంఘాల డిమాండ్లను నెరవేర్చకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గీట్ల ముకుంద రెడ్డి, ఎడ్ల రమేశ్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు వర్ణ వెంకట్‌రెడ్డి, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు, ఉపాధ్యక్షుడు రాయికంటి శ్రీనివాస్, భారత్ కిసాన్ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బోయిన అశోక్, కొయ్యడ సృజన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment