ప్రాణం తీసిన జంతువుల వేట
● విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి
బోయినపల్లి(చొప్పదండి): అటవీ జంతువుల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి విద్యుత్‌షాక్‌తో మృతిచెందాడు. ఏఎస్సై మోతీరా మ్ వివరాల ప్రకారం.. జగిత్యా ల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండకు చెందిన రెడ్డవేని నాంపల్లి(55) వ్యవసాయం చేస్తుంటాడు. అటవీ జంతువుల వేటకూ వెళ్తుంటాడు. ఈ నెల 24న ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. బోయినపల్లి మండలంలోని మల్కాపూర్ గుడ్డేలుగుల గుట్ట వద్ద అడవి పందులను పట్టేందు కు విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి, కనెక్షన్ ఇస్తున్నా డు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘా తం సంభవించి, అక్కడికక్కడే మృతిచెందాడు. నాంపల్లి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు రెండు రోజులుగా వెతుకుతున్నారు. మల్కాపూర్ గుడ్డేలుగుల గుట్ట పరిసరాల్లో మంగళవారం అతని చిన్న కుమారుడు నర్సింహులు వెతుకుతుండగా నాంపల్లి మృతదేహం కనిపించింది. చనిపోయి మూడు రోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయిందని గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య వజ్రవ్వ, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు స్వామి జీవనోపాధి నిమిత్తం దుబా యి వెళ్లాడు. అడవి పందులకు విద్యుత్‌షాక్ పెట్టే క్రమంలోనే తన భర్త మృతి చెందాడని మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు.
చోరీ కేసులో ఇద్దరికి 8 నెలల జైలు
వేములవాడ అర్బన్: ఆలయంలో చోరీకి పాల్పడిన ఇద్దరికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ వేములవాడ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ జ్యోతిర్మయి తీర్పునిచ్చారు. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ వివరాల ప్రకా రం.. వేములవాడ మండలం రుద్రవరంలో గత మార్చి 3న మల్లికార్జున స్వామి, హనుమాన్ ఆలయంలో నిజామాబాద్ జిల్లా ముప్పల్ మండలం మంచిప్పకు చెందిన నాగరాజు, బురుజుగల్లికి చెందిన మందల సాయికుమార్ చొరబడ్డారు. హుండీ పగులగొట్టి, డబ్బులు చోరీ చేశారు. పోలీసులు మ ంగళవారం కోర్టులో హాజరుపర్చగా జడ్జి 8 నెలల జైలుశిక్ష, రూ.100 చొప్పున జరిమానా విధించారు.
‘భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పది’
కొత్తపల్లి(కరీంనగర్): భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదని, ఇతర దేశాల రాజ్యాంగానికి ఆదర్శమని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్‌లో మంగళవారం నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవానికి ఆయన హాజరై, మాట్లాడారు. రాజ్యాంగం ద్వారా దేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన బీఆర్.అంబేడ్కర్‌కు ప్రజలందరూ రుణపడి ఉన్నారని అన్నారు. ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడి పని చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగాలని కోరారు. శాసనమండలి ఎన్నికల్లో అర్హులైన పట్టభద్రులందరూ ఓటుహక్కు వినియోగించుకొని, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపాలని కోరారు. అనంతరం పలువురు విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులను సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment