బాబుకు ప్రాణభిక్ష పెట్టండి
బుగ్గారం(ధర్మపురి): ఆ బాబుకు మూడు నెలల వయసప్పుడు తల్లి ఆత్మహత్య చేసుకుంది.. అప్పటినుంచి తండ్రే వ్యవసాయ కూలీ పనులు చేస్తూ పోషించుకుంటున్నాడు.. ఈ క్రమంలో ఆ చిన్నారి ఆడుకుంటూ వెళ్లి, వేడినీటిలో పడి, తీవ్రంగా గాయపడ్డాడు.. వైద్యానికి రూ.లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో తండ్రి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. బుగ్గారం మండలంలోని సిరికొండకు చెందిన గజ్జెల శ్రీనివాస్ భార్య బాబు(ఆర్యన్)కు జన్మనిచ్చిన మూడు నెలలకే ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు ఆ చిన్నారికి మూడేళ్లు. శ్రీనివాస్ వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటాడు. అయితే, ఆర్యన్ వారం రోజుల క్రితం ఆడుకుంటూ వెళ్లి, వేడినీటిలో పడిపోయాడు. ఒళ్లంతా కాలిన గాయాలవడంతో తండ్రి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. వైద్యానికి రూ.4.50 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. నిత్యం కూలీ పని చేసే తన వద్ద అన్ని డబ్బుల్లేవని, తన కొడుకును ఎలా బతికించుకునేదని శ్రీనివాస్ కంటతడి పెడుతున్నాడు. బాబు పరిస్థితిపై సోషల్ మీడియాలో చేసిన పోస్టును చూసి, చలించిపోయిన బంధువులు, శ్రీనివాస్ స్నేహితులు, గ్రామస్తులు రూ.1.20 లక్షలు అందజేశారు. మిగతా మొత్తాన్ని దాతలు అందించి, ఆర్యన్‌కు ప్రాణభిక్ష పెట్టాలని తండ్రి వేడుకుంటున్నాడు.
వేడినీటిలో పడి,
చిన్నారికి తీవ్ర గాయాలు
వైద్యానికి రూ.4.50 లక్షలు అవసరం
గతంలోనే ఆత్మహత్య చేసుకున్న తల్లి
తండ్రి వ్యవసాయ కూలీ
దాతలు సాయం చేయాలని వేడుకోలు
సాయం చేయాలనుకునేవారు
88974 52474 నంబర్
(ఢిల్లీ బాబూరావు)కు గూగుల్ పే,
99597 32213 నంబర్(గజ్జెల విజయ్)కు ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించాలని కోరుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment