రాజన్న ధ్వజస్తంభానికి రక్షణేది?
వేములవాడ: ఎములాడ రాజన్న ఆలయంలోని ధ్వజస్తంభానికి రక్షణ కరువైంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన దృష్ట్యా భద్రతా చర్యల్లో భాగంగా ధ్వజస్తంభం చుట్టూ ఉన్న జాలీలను ఆలయ సిబ్బంది తొలగించి, పక్కన పెట్టారు. సీఎం పర్యటన ముగిసి, వారం రోజులవుతున్నా అధికారులు ధ్వజస్తంభానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను విస్మరించారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు ధ్వజస్తంభంపైనే టెంకాయలు కొట్టడం, దీపాలు వెలిగించడం చేస్తున్నారు. ఈ విషయంలో అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. వెంటనే జాలీలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై ఆలయ పర్యవేక్షకుడు నర్సయ్యను వివరణ కోరగా.. తాము ఇంజినీరింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఎవరూ స్పందించడం లేదని పేర్కొన్నారు.
రంగుమారిన ధర్మగుండం నీళ్లు
కార్తీకమాసం సందర్భంగా రాజన్నను దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. మంగళవారం వచ్చిన వారికి ధర్మగుండంలోని నీరు రంగుమారి కనిపించడంతో స్నానం చేసేందుకు ఇబ్బంది పడ్డారు. ఆలయ అధికారులు నల్లగా మారిన ధర్మగుండంలోని నీటిని తొలగించి, స్వచ్ఛమైన గోదావరి జలాలను నింపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
జాలీల తొలగింపుతో
టెంకాయలు కొడుతున్న భక్తులు
దీపాలూ వెలిగిస్తున్న వైనం
Comments
Please login to add a commentAdd a comment