వేద గణితం..
సిరిసిల్ల కల్చరల్: సిరిసిల్లకు చెందిన మడుపు ముత్యంరెడ్డి 57 ఏళ్లుగా బోధన వృత్తికే పరిమి తమై, గణితానికి జీవితాన్ని అంకితం చేశారు. 80 ఏళ్ల వయసులో సొంతంగా పాఠశాల నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. పూరీ పీఠాధిపతి శంకరాచార్యులు భారతీ కృష్ణ తీర్థ స్వామి ఆంగ్లంలో రాసిన వేదగణితాన్ని తెలుగులో రాశారు. 200 పేజీలున్న ఈ పుస్తకం హైస్కూల్ విద్యార్థులకు సంఖ్యా శాస్త్రంలో ఎదురయ్యే అంక గణిత పరికర్మలను దృష్టిలో పెట్టుకొని వేద గణిత సూత్రాలు, పద్ధతులను వివరించింది. ఇది ఎంతోమంది గణిత ఉపాధ్యాయులకు కరదీపికై ంది. ముత్యంరెడ్డి ఇప్పటికీ ప్రత్యక్షంగా, ఉత్తరాల ద్వారా, సెల్‌ఫోన్ ద్వారా సందేహాలను నివృత్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment