సంస్కృతి.. సంప్రదాయాలు అలవర్చుకోవాలి
చొప్పదండి: విద్యార్థి దశలోనే సంస్కృతి.. సంప్రదాయాలు అలవర్చుకో వాలని గురుకుల సొసై టీ జోనల్ అధికారి ప్రత్యూష అన్నారు. చొ ప్పదండి సాంఘిక, సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయాన్ని గురువా రం ఆమె సందర్శించారు. వంట గది, సామగ్రిని పరిశీలించారు. కళాశాలలో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థినులు రంగవల్లులు వేశారు. హరిదాసు వేషధారణ, భోగి మంటలు, కట్టెల పొయ్యిపై బోనం వండటం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ పద్మజ, ఉపాధ్యాయినులు, సిబ్బంది పాల్గొన్నారు.
‘విద్యుత్ కార్మికులకు ఇన్సూరెన్స్ చేయించండి’
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ కాంట్రాక్టర్లు తమ వద్ద పనిచేసే కార్మికులకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించాలని టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు సూచించారు. సంస్థ సీఎండీ వరుణ్‌రెడ్డి ఆదేశాల మేరకు కరీంనగర్ విద్యుత్ భవన్‌లోని తన చాంబర్‌లో గురువారం సర్కిల్ పరిధిలోని విద్యుత్ కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్మికులకు 3 నెలలకోసారి శిక్షణ తరగతులు నిర్వహించాల ని ఆదేశించారు. డీఈలు చంద్రమౌళి, లక్ష్మారెడ్డి, తిరుపతి, కాళిదాసు, రాజం, ఏడీఈలు లావణ్య, శ్రీనివాస్, ఏఈ శ్రీనివాస్ ఉన్నారు.
ఇళ్ల సర్వేలో పొరపాట్లు జరగొద్దు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగొద్దని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ స్వరూపారాణి ఆదేశించారు. గురువారం 9వ డివిజన్ కోతిరాంపూర్, పోచమ్మవాడలో కొనసాగుతున్న సర్వే తీరును ఆమె పరిశీలించారు. దరఖాస్తుదారుల వివరాలను స్వయంగా యాప్‌లో అప్‌లోడ్ చేశారు. రూఫ్ టైప్, వాల్ టైప్, ఓనర్‌షిప్ ఆఫ్ రెసిడెన్సీ, అర్జీదారు ఇంట్లో ఉంటున్నాడా తదితర అంశాలను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ ఆదేశాల మేరకు సర్వేపై సూపర్ చెక్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సర్వే పూర్తి చేయాలని, యాప్‌లో నమోదు చేస్తున్న వివరాలను సరిచూసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. లక్ష్యానికి అనుగుణంగా సర్వేను మరింత వేగవంతం చేయాలని చెప్పారు.
హెల్మెట్ ధరిస్తే కుటుంబానికి భరోసా
● డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి
తిమ్మాపూర్(మానకొండూర్): హెల్మెట్ ధరించి, వాహనం నడిపేవారు తమ కుటుంబాలకు భరోసా ఇచ్చినట్టేనని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్(డీటీవో) శ్రీకాంత్ చక్రవర్తి అన్నారు. ఉమ్మడి జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ పెద్ది పురుషోత్తం ఆదేశాల మేరకు గురువారం రేణికుంట టోల్‌ప్లాజా వద్ద వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించి, ప్రయాణం చేయాలని సూచించారు. అవి ధరించనివారికి గులాబీ పూలు అందించి, చెప్పారు. అనంతరం డీటీవో మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. దేశంలో ఏటా 1.50 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని అన్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ప్రాధాన్యాన్ని వివరించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఎంవీఐ రవికుమార్, ఏఎంవీఐ హరిత యాదవ్, సిబ్బంది శ్రీకాంత్, దేవేందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment