‘నారాయణపూర్’కు ఎల్లంపల్లి నీరివ్వాలి
● చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గంగాధర(చొప్పదండి): యాసంగి పంటలు ఎండిపోకుండా నారాయణపూర్ రిజర్వాయర్‌కు ఎల్లంపల్లి నీరు విడుదల చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గంగాధర మండలం మధురానగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్లో గురువారం స్థానిక నాయకులతో కలిసి, మాట్లాడారు. నారాయణపూర్ రిజర్వాయర్ నిండితే నియోజకవర్గంలోని 50 వేల ఎకరాలకు సాగునీటి సమస్య ఉండదన్నారు. వారం రోజుల్లో నీరివ్వకుంటే రైతులతో కలిసి, ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని, కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు కుదేలయ్యాయని విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికే బీఆర్‌ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. నాయకులు మేచినేని నవీన్‌రావు. దూలం బాలగౌడ్, ద్యావ మధుసూదన్‌రెడ్డి, సాగి మహిపాల్‌రావు, కంకణాల విజయేందర్‌రెడ్డి, రామిడి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment