వసతి గృహాల్లో శుభ్రత పాటించాలి
కరీంనగర్/తిమ్మాపూర్(మానకొండూర్)/గన్నేరువరం: జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో శుభ్రత పాటించాలని, నాణ్యమైన సరుకులు వాడాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించా రు. హాస్టళ్ల నిర్వహణపై వసతి గృహాల ప్రత్యేకా ధికారులు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, వార్డెన్లతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం సమావేశం నిర్వహించారు. సరుకుల సరఫరాదారు ను ంచి ఏ రోజుకు కావాల్సిన సామగ్రి ఆరోజు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వంట గది, పాత్రలను శుభ్రంగా ఉంచాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కామన్ డైట్ మెనూ ప్రకారమే అల్పాహారం, భోజనం అందించాలని పేర్కొన్నారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్‌యాదవ్, డీఆర్‌వో పవన్‌కుమార్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్ పాల్గొన్నారు.
‘ఆరోగ్య మహిళ’ను వినియోగించుకోండి
గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్న ఆరోగ్య మహిళ శిబిరాలను మహిళలు వినియోగించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. తిమ్మాపూర్ మండలంలోని రేణికు ంట జీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆమె సందర్శించారు. రిజిస్టర్ తనిఖీ చేసి, మహిళలతో మాట్లాడారు. శిబిరంలో 45 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తున్నామని, ప్రతీ మహిళ చేయించుకోవాలని వైద్యులు జవేరియా, పద్మజ సూచించారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ, ఎంపీడీవో విజయ్‌కుమార్, కో– ఆర్డినేటర్ సనా, కార్యదర్శి శ్రీధర్ పాల్గొన్నారు.
ప్రపంచ వేదికపై ప్రసంగించాలి
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రపంచ వేది కపై ప్రసంగించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆకాంక్షించారు. గన్నేరువరం మండలంలోని జంగపల్లి హైస్కూల్లో టెడ్ ఎడ్ విద్యార్థుల టాక్స్ క్ల బ్, ఎగ్జిబిషన్‌ను గురువారం ప్రారంభించారు. మత్తు పదార్థాలు, స్నేహిత, నషా ముక్త భారత్, కుక్క కాటు–జాగ్రత్తలు తదితరాలపై విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రామ్‌చరణ్ అనే విద్యార్థి కలెక్టర్ చిత్రాన్ని గీసి, ఆమెకు అందజేశా డు. డీఈవో జనార్దన్‌రావు, తహసీల్దార్ నరేందర్, ఎంఈవో రామయ్య, ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీని వాస్, హెచ్‌ఎం శారద, టీచర్లు పాల్గొన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
కలెక్టర్ పమేలా సత్పతి
Comments
Please login to add a commentAdd a comment