కాలినడకన రాజన్న చెంతకు..
సిరిసిల్ల: మొక్కు తీర్చుకోవాలన్న తలంపు వారిని పాదయాత్రగా కదిలించింది. దాదాపు 60 కిలోమీటర్లు నడిచి వచ్చి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన 28 మంది మహిళలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కాలినడకన బయలుదేరారు. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం ఉన్నా.. కాలినడకన రావాలన్న మొక్కు తీర్చుకునేందుకు సోమవారం ఉదయం 6 గంటలకు పల్లికొండ నుంచి నడకను ప్రారంభించారు. మానాల, రుద్రంగి, చందుర్తి మీదుగా వేములవాడకు చేరుకోవాలి. కానీ ఒక్కరోజులో 60 కిలోమీటర్ల ప్రయాణం సాధ్యం కాకపోవడంతో సోమవారం రాత్రి చందుర్తి మండలంలో బసచేసి, మంగళవారం వేములవాడకు చేరుకొని రాజన్నను దర్శించుకోవాలని వస్తున్నారు.
● పల్లికొండ నుంచి వేములవాడకు..
● 60 కిలోమీటర్లు పాదయాత్రగా కదిలిన మహిళలు
Comments
Please login to add a commentAdd a comment