మూతపడుతున్న ఆన్‌లైన్ యాప్‌లు
జగిత్యాలక్రైం: ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీ వస్తుందన్న ఆశతో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టిన వారికి ఆన్‌లైన్ కంపెనీలు రోజుకోటి బోర్డులు తిప్పేస్తుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. యాప్‌లు నిలిచిపోవడంతో తమ పెట్టుబడులు ఎలా తీసుకోవాలన్నదానిపై ఆందోళన చెందుతుండగా మధ్యవర్తులగా ఉన్నవారిపై తీవ్ర ఒత్తిళ్లు పెంచుతున్నారు. దీంతో వారు కూడా గుట్టచప్పుడు కాకుండా హైదరాబాద్, ముంబై వెళ్లి కంపెనీ నిర్వాహకులతో చర్చలు జరుపుతున్నామంటూ కాలం వెళ్లదీస్తున్నారు. జగిత్యాల జిల్లాలో సుమారు రూ.150 కోట్ల మేరకు పెట్టుబడి పెట్టిన పలు కంపెనీలు రెండునెలల్లో సుమారు నాలుగు మూతపడ్డాయి. దీంతో పెట్టుబడి పెట్టిన కొన్ని కంపెనీలు వారికి ఆన్‌లైన్ కంపెనీ యాప్‌ను మార్చుతున్నామని, ఆందోళన చెందవద్దని సమాచారం అందించారు. జిల్లాలో సుమారు ఇప్పటికే నాలుగు యాప్‌లు మూతపడ్డాయి.
మూతపడిన కంపెనీలు
జిల్లాలో పెట్టుబడి పెట్టిన నాలుగు ఆన్‌లైన్ యాప్‌లు రెండు నెలలుగా మూతపడ్డాయి. దీంతో తాము ఎవరిపై ఫిర్యాదుచేయలో తెలియక అయోమయంలోఉన్నారు. ఇప్పటికే మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జిల్లాలో రెండు కంపెనీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతమంది పెట్టుబడిదారులు ఇప్పటికే జైలుకు వెళ్లారు. మరికొందరు హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు.
పరారీలో నిందితులు
వాస్తవానికి పోలీసులు కంపెనీ నిర్వాహకులపై కేసులు పెట్టాల్సి ఉండగా వారి వివరాలు లేకపోవడంతో పెట్టుబడి పెట్టించిన వారిపైనే కేసులు నమోదు చేశారు. దీంతో అసలు యాప్ తయారుచేసి పెట్టుబడులు పెట్టేలా చేసిన యాప్ యజమానులు పరారీలో ఉన్నారు.
ఆందోళన చెందుతున్న పెట్టుబడిదారులు
మధ్యవర్తులపై ఒత్తిళ్లు
కేసులు నమోదు చేస్తున్న పోలీసులు
కేసులు నమోదు చేస్తున్నాం
జిల్లాలో ఇప్పటికే యాప్ పెట్టుబడులు పెట్టించి మోసానికి పాల్పడగా బాధితుల ఫిర్యాదు మేరకు ఓ కంపెనీపై కేసులు నమోదు చేసి కొందరిని రిమాండ్‌కు తరలించాం. ఎవరైనా బాధితులుంటే ఫిర్యాదు చేయాలి. యాప్‌లపై కేసులు నమోదు చేసి చర్యలు చేపడతాం.
– అశోక్‌కుమార్, ఎస్పీ, జగిత్యాల
Comments
Please login to add a commentAdd a comment