కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ బహిష్కరించిన ఎమ్మెల్యే
రుద్రంగి(వేములవాడ): ఎన్నికల హామీ అయిన కల్యాణలక్ష్మి చెక్కులతోపాటు తులం బంగారం ఇవ్వడం లేదని చెక్కుల పంపిణీని బహిష్కరిస్తున్నట్లు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఓ లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా తులం బంగారం హామీని అమలు చేయకపోవడంపై నిరసన తెలిపారు. ఈమేరకు రుద్రంగి మండలం మానాల, గిరిజన తండాలలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి రావడం లేదంటూ ఓ లేఖను రుద్రంగి తహసీల్దార్‌కు పంపినట్లు బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు దెగావత్ తిరుపతి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులతోపాటు తులం బంగారం వెంటనే అందజేయాలని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment