మంథని: భర్త, మామ వేధింపులు భరించలేకపోతున్నానంటూ.. ఓ గర్భిణి తన కుమారుడితో కలిసి రోడ్డుపై ఆందోళనకు దిగింది. న్యాయం చేయాలని వేడుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా యువతితో మంథని పోచమ్మవాడకు చెందిన రావుల మారుతి ప్రసాద్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు. ఆమె ప్రస్తుతం 7 నెలల గర్భిణి. నిత్యం మద్యం సేవించి, అదనపు వరకట్నం కోసం భర్త, లైంగికంగా మామ వేధిస్తున్నారు. ఇద్దరూ కలిసి గత నెల 12న ఆమెను ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో బాధితురాలు పుట్టింటికి వెళ్లిపోయింది. ఆదివారం తన తల్లి, కుమారుడితో కలిసి మంథనికి చేరుకుంది. స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో బైఠాయించింది. తన భర్తకు ఇప్పటికే నాలుగు వివాహాలు జరిగాయని తెలిసిందని, మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఫొటో చూపిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను ఠాణాకు తీసుకెళ్లారు. ఈ విషయమై ఎస్సై రమేశ్‌ను వివరణ కోరగా.. బాధితురాలు ఇదివరకే తమకు ఫిర్యాదు చేసిందన్నారు. తర్వాత పుట్టింటికి వెళ్తానని చెప్పడంతో ఖర్చులకు రూ.500 ఇచ్చి, పంపించామని తెలిపారు. గత నెల 12 తర్వాత ఆమె మళ్లీ రాలేద ని, గర్భిణి కావడంతో తాము పిలవలేదని చెప్పా రు. ఆదివారం ఇక్కడికి వచ్చి, అత్తింటివారితో గొడవ పడిందన్నారు. అనంతరం రోడ్డుపై బైఠాయి ంచిందని పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదుపై విచారణ జరిపి, న్యాయం చేస్తామన్నారు.
భర్త, మామ వేధిస్తున్నారని ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment