![మల్లన](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09mnk52-180009_mr-1739131269-0.jpg.webp?itok=06OB5OzN)
మల్లన్నకు బోనం
శంకరపట్నం: శంకరపట్నం మండలం ముత్తారం గ్రామంలో ఆదివారం మైలాల మల్లన్నస్వామి విగ్రహాలను నూతన ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా యాదవ కులస్తులు స్వామి వారికి బోనాలు సమర్పించి, పట్నాలు వేశారు. చల్లంగచూడు మల్లన్నా.. అంటూ వేడుకున్నారు. మల్లన్న జాతర సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
వెంకన్నకు తులాభారం
జమ్మికుంట: జమ్మికుంట శ్రీ వెంకటాద్రినగర్‌లోని శ్రీవేంకటేశ్వస్వామి ఆలయంలో సప్తదశ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకులు కృష్ణామాచార్యులు, వేణుగోపాలచార్యులు ఆధ్వర్యంలో ఆదివారం మహా సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. సాయంత్రం పండ్లతో స్వామి వారికి తులాభారం, సామూహిక శ్రీవిష్ణుసహస్త్రనామస్తోత్ర పారాయణం, ఎదుర్కోలు నిర్వహించారు. ఆలయ కమిటీ, వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ ముక్కా జితేంద్ర గుప్తా, భక్తులు పాల్గొన్నారు.
![మల్లన్నకు బోనం1](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09hzb109-180133_mr-1739131269-1.jpg)
మల్లన్నకు బోనం
Comments
Please login to add a commentAdd a comment