వంట చేసి.. విద్యార్థులకు వడ్డించి..
● సంక్షేమ హాస్టల్‌లో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్ బస
కరీంనగర్: నగరంలోని ముకరంపురలో ఉన్న సమీకృత సంక్షేమ బాలుర గృహ సముదా యంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫఫుల్ దేశాయ్ ఆదివారం రాత్రి బస చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఫుడ్ మెనూ, వంటశాలను పరిశీ లించారు. విద్యార్థుల కోసం స్వయంగా వంట చేశారు. ఆలూకుర్మా, సేమియా పాయసం త యారు చేసి వడ్డించారు. పిల్లలతో కలిసి భోజ నం చేశారు. విద్యాబోధనపై అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ వసతి గృహాల అధికారులు నెలకు ఒకసారి హాస్టల్, రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించాలని సూచించారు. తనిఖీ లు చేయడం వల్ల పిల్లలకు మనోధైర్యం పెరుగుతుందని అన్నారు. కేర్‌టేకర్లు భోజనం వండే సమయాల్లో, విద్యార్థులు భోజనం చేసే సమయాల్లో కిచెన్‌షెడ్, డైనింగ్ హాల్‌లో ఉండాలని సూచించారు. వంట సిబ్బంది శుభ్రత పాటించాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే విద్యార్థులు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి హాస్టల్లోనే నిద్రించారు. ఎస్సీ సంక్షేమశాఖ ఈడీ నాగార్జున, జిల్లా యూత్ కో– ఆర్డినేటర్ రాంబాబు ఆయన వెంట ఉన్నారు.
ఎన్నికల పరిశీలకులొస్తున్నారు
కరీంనగర్ అర్బన్: ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల క్రమంలో ఎన్నికల సరళిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులుగా బెన్హర్ మహేష్ దత్ ఎక్కాను నియమించగా పట్టభద్రుల పరిశీలకులుగా సంజయ్ కుమార్‌ను నియమించారు.
కలెక్టరేట్ ఎదుట నిరసన
కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం 2025–26 బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం 20శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ విద్యాపరిరక్షణ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఎన్.తిరుపతి మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్లలో విద్యారంగాని కి అరకొర నిధులు కేటాయించి, పూర్తిగా విస్మరించిందని, తద్వారా నాణ్యత ప్రమాణాలు పడిపోయాయని అన్నారు. 2025–26 బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం 20శాతం నిధులు కేటాయించి, విద్యారంగానికి వినియోగించాల ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.రఘుశంకర్‌రెడ్డి మాట్లాడుతూ కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు లేక విద్యా ప్రమాణాలు అడుగంటిపోతున్నాయన్నారు. విద్యారంగంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చాలా వేగంగా జరుగుతోంద ని, ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవా ల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కమిటీ సభ్యులు వి.రాజిరెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, కె.నారాయణరెడ్డి, చంద్రమౌళి, ఏసురెడ్డి, జానకిదేవి, నరహరి, రాంచంద్రారెడ్డి, తిరుపతి, బాలయ్య, రాజమౌళి, అంజయ్య, శ్రీనివాస్, తిరుపతి, రమేష్, చంద్రశేఖర్, రాజమల్లు పాల్గొన్నారు.
వంట చేసి.. విద్యార్థులకు వడ్డించి..
Comments
Please login to add a commentAdd a comment