![56 ఏళ్లకు ఒక్కచోటకు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09srl178-180048_mr-1739131165-0.jpg.webp?itok=QF4dou8b)
56 ఏళ్లకు ఒక్కచోటకు
సిరిసిల్ల కల్చరల్: పదోతరగతి చదివి.. ఏకంగా 56 ఏళ్లు గడిచాయి.. తమ చిన్ననాటి మిత్రులను
కలుసుకోవాలని ఆరాటపడ్డారు. చివరకు ఆదివారం ఒక్కచోట చేరి, పూర్వ విద్యార్థుల సమ్మేళనం
నిర్వహించుకున్నారు. ఈ వేడుకకు సిరిసిల్ల పట్టణంలోని ఓ బంకెట్ హాల్ వేదికై ంది. సిరిసిల్ల
జెడ్పీ హైస్కూల్ 1969–70 బ్యాచ్ పదోతరగతి విద్యార్థులు 65 మంది 5 దశాబ్దాల తర్వాత తమ
బాల్య మిత్రులను కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. చిన్ననాటి
జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు మడుపు ముత్యంరెడ్డి, ఎన్‌సీసీ నారాయణ, తూడి వెంకట్రావు, కాచం వెంకటేశంలను సత్కరించారు. అందరూ కలిసి
భోజనం చేసి, ఫొటోలు దిగారు. రోజంతా సందడి సందడిగా గడిపారు.
Comments
Please login to add a commentAdd a comment