సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్– మెదక్– ఆది లాబాద్– నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి నేడు నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీతక్క , కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఉద యం 10:30 గంటలకు ఎస్సారార్ కళాశాల మైదా నం నుంచి మంత్రుల బృందంతో కలిసి నరేందర్‌రెడ్డి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ సమర్పిస్తారు. పట్టభద్రుల నియోజకవర్గంలోని నాలుగు జిల్లాల నుంచి పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు, ము ఖ్య నేతలు పాల్గొననున్నారు. నరేందర్ రెడ్డి ఇది వరకే కుటుంబసభ్యులతో కలిసి ఒకసెట్ నామినేషన్ వేశారు. పార్టీ పెద్దలతో కలిసి సోమవారం రెండోసెట్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment