న్యాయవాది ఈరణ్ణగౌడ పాటిల్ (ఫైల్)
యశవంతపుర: పట్టపగలు న్యాయవాదిని దారుణంగా హత్య చేసిన ఘటన కలబురిగి నగరంలో గురువారం ఉదయం జరిగింది. సాయిమందిరం సమీపంలోని గంగా అపార్ట్‌మెంట్ ఆవరణలో తలపై బండరాయి వేసి హత్య చేశారు.
వివరాలు.. న్యాయవాది ఈరణ్ణగౌడ పాటిల్ (40) గురువారం ఉదయం కోర్టుకు వెళ్లడానికి అపార్ట్‌మెంట్ నుంచి కిందకు దిగి వచ్చాడు. పొంచి ఉన్న దుండగులు ఆయన మీదకు రావడంతో పరుగులు తీశాడు. దుండగులు వెంబడించి బండరాయితో తలను నుజ్జునుజ్జుగా హత్య చేసి పారిపోయారు. విశ్వవిద్యాలయ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. భూ వివాదం వల్ల సమీప బంధువులే హత్య చేసినట్లు అనుమానాలున్నాయి.
డ్రగ్స్ దందా.. ప్రైవేటు ఉద్యోగి హత్య
పాతకక్షల కారణంగా యువకున్ని అంతమొందించిన ఘటన బెంగళూరు తలఘట్టపుర పోలీసుస్టేషన్ పరిధిలోని మల్లసంద్రలో జరిగింది. చిక్కల్లసంద్రకు చెందిన శరత్ (30) ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. మంగళవారం రాత్రి మల్లసంద్ర దగ్గర దుండగులు కత్తులతో పొడిచి చంపి శవాన్ని పొదల్లో పడేశారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో దారిన వెళ్లేవారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాత కక్షల కారణంగా హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో శరత్‌పై ఆర్‌ఆర్‌నగర పోలీసుస్టేషన్ పరిధిలో డ్రగ్స్ కేసు నమోదైంది. డ్రగ్స్ దందానే కారణమని భావిస్తున్నారు.
కలబురిగిలో దారుణం
Comments
Please login to add a commentAdd a comment