![భర్త తిప్పేశ్‌తో యశోధ(ఫైల్) - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/8/07bng30-120041_mr.jpg.webp?itok=MfznL7hI)
భర్త తిప్పేశ్‌తో యశోధ(ఫైల్)
యశవంతపుర: దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా నుగ్గిహళ్లిక్రాస్ వద్ద ఈనెల 4న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు భావిస్తున్న యశోధది హత్య అని తేలింది. భర్తనే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించి అరెస్ట్ చేశారు. చెన్నగిరి తాలూకా సారధి హోసూరుకు చెందిన యశోధ, నరగనహళ్లి నివాసి తిప్పేశ్(28)లు ప్రేమించుకున్నారు. మూడు నెలల క్రితం పెద్దలే దగ్గరుండి వారికి వివాహం జరిపించారు.
ఈనెల 4న తిప్పేశ్ బైక్‌పై యశోధను ఆమె పుట్టింటికి తీసుకెళ్లేందుకు బయల్దేరాడు. నుగ్గిహళ్లి క్రాస్ వద్ద కింద పడి యశోధ మృతి చెందినట్లు నాటకం ఆడాడు యశోధ తండ్రి చంద్రప్పకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిప్పేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా హెల్మెట్‌తో బాది హత్య చేసినట్లు అంగీకరించాడని దావణగెరె పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment